Namaste NRI

ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరిక .. ముగింపునకు 5 షరతులు

ఇరాన్‌కు చాలా క్లిష్టతరమైన సమయం రాబోతున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్‌ చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్‌ మరోసారి హెచ్చరించారు. ట్రంప్‌ మాట్లాడుతూ త్వరలో శాంతి ఒప్పందానికి కనుక రాకపోతే ఈసారి ఇరాన్‌ అతి చెడ్డ సమయాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించారు. కాగా, ఇరాన్‌పై తీవ్రస్థాయిలో దాడులు చేసేందుకు పెంటగాన్‌ సన్నాహాలు చేస్తున్నదని, ఈసారి అధికారికంగా యుద్ధం పేరును ఆపరేషన్‌ స్లెడ్జ్‌హ్యామర్‌ గా మార్చేందుకు యోచిస్తున్నదని ఒక మిలిటరీ ఉన్నత అధికారి తెలిపారు.

యుద్ధం ముగింపుపై అమెరికా, ఇరాన్‌ మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఇరు వర్గాల మధ్య చర్చలకు సంబంధించి ఇరాన్‌ పంపిన ప్రతిపాదనలపై అమెరికా ఐదు షరతులు విధించినట్టు ఇరాన్‌ తెలిపింది. అమెరికా నుంచి ఎలాంటి స్పష్టమైన రాయితీలు అందులో లేవని, చర్చల్లో ప్రతిష్ఠంభనకు దారితీస్తున్నదని ఇరాన్‌ నాయకత్వం పేర్కొన్నది.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events