శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ పురస్కారాలు లభించాయి. సీఐఐ, గ్రోద్రేజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ నిర్వహించిన ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ 22వ జాతీయ అవార్డుల్లో జీఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేషనల్ ఎనర్జీ లీడర్, ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్ యూనిట్ అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ బాధ్యతాయుతమై కార్పొరేట్ సంస్థగా ఇంధన సామర్థ్యాలను సమర్థంగా వినియోగించుకోవడం, ఇంధన పొదుపు, ప్రయాణికులకు సంతృప్తికర సేవలు అందించడం వల్లనే ఈ అవార్డులు వరించాయన్నారు.