Namaste NRI

ఉగ్రం ఫస్ట్ సింగిల్.. వచ్చేది అప్పుడే

అల్లరి నరేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఉగ్రం. విజయ్‌ కనకమేడల దర్శకుడు. ఈ చిత్రాని  షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.   యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్‌సింగిల్‌ దేవేరి  అనే గీతాన్ని ఈ నెల 19న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వర్షం పడుతుండగా అల్లరి నరేష్ , మిర్నా బైక్‌ పై కూర్చొని  వున్న అనౌన్స్ మెంట్ పోస్టర్‌ ని చూస్తుంటే..  అందమైన రొమాంటిక్‌ గీతమిది. చక్కటి ప్రణయ భావనలకు అద్దం పడుతుంది. మెలోడీగా మెప్పిస్తుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్‌ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సిద్‌, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్‌ పెద్ది. ఈ ఏడాది వేసవిలో సినిమాను థియేటర్లలో విడుదల కానుంది. 

Social Share Spread Message

Latest News