Namaste NRI

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఉక్కు సత్యాగ్రహం

పి.సత్య రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వలో నిర్మించిన చిత్రం ఉక్కు సత్యాగ్రహం.  మేఘన లోకేష్‌, గద్దర్‌, ఎం.వి.వి. సత్యనారాయణ, అయోధ్య రామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశాన్ని  ప్రధానంగా తీసుకొని తెరకెక్కించారు. ఈ సినిమా కోసం రచయత సుద్దాల అశోక్‌ తేజ్‌ రాసిన గీతాన్ని చిత్ర బృందం  హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ సందర్భంగా నటుడు, దర్శక నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదలు చేస్తుంటే దాన్ని ఈ రోజున ప్రైవేటీకరణ చేయడం న్యాయమా? ఈ అంశంపైనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ సినిమాని తీవారు సత్యారెడ్డి. రాజకీయా పార్టీలు ఈ ప్రైవేటీకరణను ఆపాలి అన్నారు. ఈ సమస్య కేవలం విశాఖపట్నం ప్రజలది మాత్రమే కాదు. మన తెలుగు ప్రజలందరిదీ. తెలుగు వారంతా ఏకమైతేనే  ప్రైవేటీకరణను ఆపగలరని నమ్ముతున్నా అన్నారు గద్గర్‌. ఈ కార్యక్రమంలో గద్గర్‌, వేణుగోపాల చారి, సత్యారెడ్డి, బెక్కం వేణుగోపాల్‌, దర్శకుడు త్రినాధ్‌రావ్‌ నక్కిన,  దర్శకుడు ఆర్‌ నారాయణమూర్తి తదదితరులు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events