Namaste NRI

ఉక్రెయిన్‌ దాడి.. ఆకాశంలోనే

ఉక్రెయిన్‌పై రష్యా మొదలెట్టిన యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి కనపడుతోంది. అయితే మొదట్లో రష్యా దాడిని అడ్డుకుంటూ వచ్చిన ఉక్రెయిన్‌ ఆర్మీ గత రెండు వారాలుగా ఎదురు దాడులు చేస్తోంది.  పేరుకి చిన్న దేశం, ఆయుధ సంపత్తి పరంగా రష్యాతో సమఉజ్జీ కాకపోయినా ధీటుగా నిలబడి ఉక్రెయిన్‌ పోరాడుతోంది. ఉక్రెయిన్‌ ఆర్మీ జరిపిన మిస్సైల్‌ దాడితో రష్యాకు చెందిన ఎంఐ`28 హెలికాప్టర్‌ రెండు ముక్కలైంది. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్‌ చేశారు. బ్రిటన్‌కు చెందిన స్ట్రార్‌స్ట్రీక్‌ మిస్సైల్‌తో రష్యా హెలికాప్టర్‌ను కూల్చినట్లు తెలుస్తోంది. ఎంఐ28 హెలికాప్టర్‌కు చెందిన తోక భాగం క్షిపణి దాడితో తెగిపోయింది. లుహన్స్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్టార్‌స్ట్రీక్‌ క్షిపణులను బ్రిటన్‌ డెవలప్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దీన్నే అడ్వాన్స్‌డ్‌ పోర్టబుల్‌ మిస్సైల్‌ సిస్టమ్‌గా బ్రిటన్‌ పిలుస్తోంది. థేల్స్‌ కంపెనీ ఈ మిస్సైళ్లను తయారు చేస్తుంది. ధ్వని కన్నా మూడు రెట్ల అధిక వేగంతో స్టార్‌స్ట్రీక్‌ ప్రయాణిస్తుంది.  దీని వేగం సహాయంతో గాల్లో ఎగిరే టార్గెట్‌లను సునాయాసంగా పేల్చేయవచ్చు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events