ఉక్రెయిన్‌పై రష్యా మొదలెట్టిన యుద్దం భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్ తమ డిమాండ్లను నెరవేర్చేదాకా యుద్దాన్ని ఆపేదే లేదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన కాసేపటికే ఈ యుద్ధంపై అగ్రరాజ్యం అమెరికా సంచలన ప్రకటన చేసింది. యుద్ధంలో విజయం ఉక్రెయిన్‌నే వరిస్తుందని అమెరికా చేసిన ప్రకటన మరింత ఆందోళనకు గురి చేసేదిగానే ఉంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలంటూనే ఉక్రెయిన్‌పై దాడులు సరికాదంటూ రష్యాకు చెబుతూ వస్తున్న అమెరికా తాజాగా ఓ సంచలన ప్రకటన చేసింది. ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రసంగం తర్వాత అమెరికా ప్రతినిధి కీలక ప్రటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో అంతిమ విజయం మాత్రం ఉక్రెయిన్‌దేనని అమెరికా ప్రతినిధి పేర్కొన్నారు.














