స్విట్టర్లాండ్‌లో ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు జరిగే ఉన్నత స్థాయి సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సాగుతున్న దశలో తలెత్తిన సంక్షోభ నివారణకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ భేటీకి రష్యా, చైనాలు వెళ్లకపోవ చ్చు. ఇక్కడి శాంతిసదస్సుకు ముందు ఇటలీలో జి 7 సమ్మిట్ జరుగుతుంది. దీనికి భారతదేశంతో పాటు ప్రధాన గ్లోబల్ సౌత్ దేశాలకు ఆహ్వానాలు అందాయి.
స్విట్జర్లాండ్ శాంతి సదస్సు ఈ నెల 15, 16 తేదీలలో ఖరారు అయింది. అంతకు ముందు రోజు ఇటలీలో జరిగే జి 7 సమ్మిట్‌కు వచ్చే నేతలు ఈ సదస్సుకు తరలివచ్చే వీలుంది. ఈ సదస్సు ఏర్పాటు ప్రాతినిధ్యం గురించి ఇప్పటికే స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత్, బ్రెజిల్, చైనా, ఇథియోపియా, బ్రెజిల్, చైనా, అరేబియా, దక్షిణాఫ్రికా దేశాల నేతలు , ఆయాదేశాల రాయబార్లతో చర్చించింది. శాంతిస్థాపన దిశలో జరిగే ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని కోరింది. ఇప్పటికైతే సదస్సుకు హాజరీ విషయంలో చైనా, రష్యాల నుంచి ఎటు వంటి స్పందన వెలువడలేదు. ఇప్పటికే రష్యా ఈ సదస్సు వల్ల ఎటువంటి ఉపయోగం లేదని విమర్శించింది.