Skip to main content

Namaste NRI

రష్యాపై ఉక్రెయిన్‌ తొలి వైమానిక దాడి

ఉక్రెయిన్‌ తమ భూభాగంలో తొలి వైమానిక దాడి చేసిందని రష్యా ఆరోపించింది.  రష్యా దాడులకు ప్రతిస్పందనగా ఉక్రెయిన్‌ సైన్యం తొలిసారి రష్యాపై దాడికి దిగింది. రష్యా భూభాగంలోని పశ్చిమ బెల్గోరోడ్‌ నగరంలోని చమురు డిపోపై ఉక్రెయిన్‌పై చెందిన రెండు హెలికాప్టర్లు వైమానిక దాడి చేశాయని రష్యన్‌ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌ సరిహద్దుకు 40 కిలోమీటర్ల  దూరంలో ఉన్న బెల్గోరోడ్‌లో ఈ బాంబు దాడి ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. వైమానిక దాడితో భారీగా మంటలు వ్యాప్తించాయని, ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు తెలిపారు. 170 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపుచేసినట్లు చెప్పారు. సిబ్బందిని అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయించినట్లు రష్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి 37వ రోజుకు చేరుకుంది.

Social Share Spread Message

Latest News