Skip to main content

Namaste NRI

భారత్‌కు అమెరికా ఊహించని షాక్

భారత్, అమెరికా దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై న్యూఢిల్లీ లో కీలకమైన ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న వేళ, భారత్‌కు అమెరికా ఊహించని షాకిచ్చింది. భారతదేశంలో అన్యాయమైన వాణిజ్య పద్ధతులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం భారత్‌ను దోషుల జాబితాలో చేర్చింది. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వివిధ రకాల దిగుమతులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలను విధించాలని ప్రతిపాదించింది.

అమెరికా ట్రేడ్ యాక్ట్ 1974 లోని సెక్షన్ 301 కింద నిర్వహించిన 60 సుదీర్ఘ దర్యాప్తుల ఫలితాలను యూఎస్‌టీఆర్ అధికారికంగా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 54 ఆర్థిక వ్యవస్థలలో బలవంతపు శ్రమ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను సమర్థవంతంగా నిషేధించడానికి లేదా నిరోధించడానికి తగినంత కఠినమైన చర్యలు లేవని అమెరికా తన నివేదికలో స్పష్టంచేసింది. ఈ 54 దేశాల జాబితాలోనే భారతదేశాన్ని కూడా చేర్చడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.


Social Share Spread Message

Latest News