కోవిడ్ నియంత్రణలో భాగంగా యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ భారీ వితరణ చేసింది. 10 లక్షల ఎన్95 మాస్కులు, కెఎన్ 95 మాస్కులు ఇస్తున్నట్టు తెలిపిందని కోవిడ్ నోడల్ అధికారి డా.అర్జా శ్రీకాంత్ తెలిపారు. వీటి విలువ రూ.12 కోట్లు ఉంటుందన్నారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, టొరంటో వారు 200 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఇవి త్వరలోనే రాష్ట్రానికి వస్తాయని శ్రీకాంత్ తెలిపారు.