Namaste NRI

సోమాలియాలో అమెరికా సైన్యం దాడులు

సోమాలియాలోని గాల్కాడ్ టౌన్ సమీపంలో అమెరికా మిలిటరీ దాడులు నిర్వహిస్తున్నది. ఇందులో ఇస్లామిక్ అల్ శబాబ్కు చెందిన 30 మంది తీవ్రవాదులు హతమైనట్లు అమెరికా ఆఫ్రికా కమాండ్ వెల్లడించింది. అల్ శబాబ్ సంస్థకు చెందిన 100 మందికిపైగా తీవ్రవాదులు దాడులు చేశారని, వారిని నిలువరించేందుకు ఆత్మరక్షణలో భాగంగా సోమాలియా ఆర్మితో కలిసి యూఎస్ ఆర్మీ దాడులు చేసిందని తెలిపింది. ఈ దాడిలో సాధారణ పౌరులు ఎవరూ గాయపడలేదని చెప్పింది.  సోమాలియాలో ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు గతేడాది మే నుంచి అమెరికా సైన్యం ఆ దేశంలో మోహరించింది. ఉగ్రవాదులతో జరుగుతున్న పోరులో సోమాలియా ఆర్మితో కలిసి యూఎస్ సైనికులు పాల్గొంటున్నారు. ఆ దేశ సైన్యానికి శిక్షణతోపాటు సహాయం అందిస్తున్నది. 

Social Share Spread Message

Latest News