భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. అప్గాన్‌లో పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారంపై చర్చలు జరపనున్నారు. ఆయన విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు ధోవల్‌తో చర్చలు జరుపుతారు. ప్రధాని మోదీని కలుసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారత్‌కు బయలుదేరే ముందు వాషింగ్టన్‌లో బ్లింకెన్ మాట్లాడుతూ అమెరికా భాగస్వామ్య దేశాలతో పరస్పర సహాకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు ఇండో` పసిఫిక్, మధ్యప్రాచ్యంలో పరిస్థితులపై చర్చలు జరుపుతానన్నారు. అనంతరం ఆయన కువైట్‌కు బయలుదేరుతారు.