Skip to main content

Namaste NRI

వైష్ణవ్ తేజ్ వచ్చేస్తున్నాడు

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రంగ రంగ వైభవంగా. కేతికా శర్మ నాయికగా నటిస్తున్నది. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌ పీ సంస్థ నిర్మిస్తోంది. బీవీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ నిర్మాణంలో దర్శకుడు గిరీశాయ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఓ కొత్త లుక్‌ను పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో కేతిక టేబుల్‌పై తలవాల్చి సేద తీరతుండగా, ఆమెనే తదేకంగా చూస్తూ వైష్ణవ్‌ రొమాంటిక్‌ లుక్‌లో కనిపించారు. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా సినిమా ఉండనుంది.  వైష్ణవ్‌, కేతికల జోడి అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రచార చిత్రాలకు వస్తున్న  ఆదరణతో ఉత్సాహంగా ముందుకెళ్తున్నాం అన్నారు. రంగ రంగ వైభవంగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మే 27న ఈ సినిమాను విడుదల చేస్తున్నామని, సకుటుంబంగా చూసేలా సినిమా ఉంటుందని నిర్మాత అన్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. శామ్‌ దత్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Social Share Spread Message

Latest News