Namaste NRI

వరుణ్ తేజ్.. గని వచ్చేది అప్పుడే

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన గని విడుదల ఖారారైంది. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ సరసన సయీ ముజ్రేకర్‌ నటించారు. ఈ సందర్భంగా దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి మాట్లాడుతూ సామాన్య యువకుడు గని తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి బాక్సింగ్‌ బరిలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిణామాలేమిటి? ఆశయసాధన కోసం అతను సాగించిన అలుపెరుగని పోరాటం చివరకు ఏ గమ్యానికి చేరిందో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. ఆద్యంతం భావోద్వేగా ప్రధానంగా నడిచే చిత్రమిది. బాక్సర్‌గా వరుణ్‌తేజ్‌ పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి వైవిధ్యంగా ఉంటుంది అని చిత్ర బృందం తెలిపింది. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. సిద్థు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌చంద్ర నటించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: జార్జ్‌ సి.విలియమ్స్‌, ఎడిటర్‌ :మార్తాండ్‌ కె వెంకటేష్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events