నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. తాజాగా మేకర్స్ ఫస్ట్‌సింగిల్ జై బాలయ్యతో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తమన్ మైండ్ బ్లోయింగ్ స్కోర్ పాటను నెక్ట్స్ లెవన్‌కు తీసుకెళ్లింది. రామగోజయ్యశాస్త్రి ఈ గీతాన్ని రచించారు. హీరో పాత్ర ఔన్నత్యాన్ని తెలియజేసేలా ఉంది. బాలకృష్ణ డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట చాలా కాలం పాటు మ్యూజిక్ చార్టుల్లో అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జవనరిలో సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.














