Namaste NRI

అనంతపురంలో వీరసింహారెడ్డి షెడ్యూల్ ప్రారంభం

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం వీరసింహారెడ్డి. శ్రుతిహాసన్‌ కథానాయిక. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. దునియా విజయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  అనంతపురంలోని పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయం, ఉరవకొండ, పెనుకొండ కోట తదితర ప్రదేశాల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి.  మాస్‌ యాక్షన్‌ అంశాలతో రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది.   ఇందులో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్‌, టైటిల్‌ కు ట్రెమండస్‌ మంచి రెస్పాన్స్‌  వచ్చింది.  ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదరుచూస్తున్న వీరసింహారెడ్డి 2023 సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: రిషి పంజాబీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events