Namaste NRI

వెంకటేష్ సైంధవ్ ప్రారంభం

వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్. అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు.  శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ముహూర్తపు సన్నివేశానికి కె.రాఘవేంద్ర రావు క్లాప్నివ్వగా, దిల్ రాజు కెమెరా స్విఛాన్ చేశారు. వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.  బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రను పోషిస్తున్నారు.  బుధవారం విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్కు అద్భుతమైన స్పందన లభించింది. వెంకటేష్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాం. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మణికందన్, సంగీతం: సంతోష్ నారాయణ్, ఎడిటర్: గ్యారీ బీహెచ్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత: వెంకట్ బోయనపల్లి, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events