Skip to main content

Namaste NRI

అమెరికా ఉపాధ్యక్షురాలు సలహాదారుగా.. భారతీయ అమెరికన్

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌ రక్షణ సలహాదారుగా ఇండియన్‌ అమెరికన్‌ నివాకాదళం ప్రముఖురాలు శాంతి సేథీ నియమితురాలయింది. శాంతి సేథి డిసెంబర్‌ 2010 నుండి మే 2012 వరకు యూఎస్‌ఎస్‌ డెకాటూర్‌ అనే గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌కు నాయకత్వం వహించారు. భారతదేశాన్ని సందర్శించిన అమెరికా నౌకాదళ నౌకకు ఆమె మొదటి మహిళా కమాండర్‌. యూఎస్‌ నేవీ యుద్ధ నౌకలో మొదటి భారతీయ అమెరికన్‌ కమాండర్‌ శాంతి సేథి ఇటీవల వైస్‌ ప్రెసిడెంట్‌ హారిస్‌ కార్యాలయంలో చేరారు. శాంతి సేథి తండ్రి 1960 ప్రారంభంలో భారతదేశం నుండి అమెరికాకి వలస వెళ్లారు. కాగా కమలా హ్యారిస్‌ యునైటెడ్‌ స్టేట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైక మొట్టమొదటి భారతీయ సంతతి వ్యక్తి.

Social Share Spread Message

Latest News