Skip to main content

Namaste NRI

ఈ యుద్ధంలో విజయం అసాధ్యం : జీ 7

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిషేధించాలని జి`7 దేశాధినేతలు నిర్ణయానికొచ్చారు. అమెరికా, బ్రిటన్‌, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌ దేశాల అధినేతలు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ యుద్ధంలో పుతిన్‌ విజయం దక్కడం అసాధ్యమని జి`7 దేశాల నాయకులు తేల్చి చెప్పారు. కాగా  పోలండ్‌లోని రష్యా రాయబారి సెర్గీ అండ్రీవ్‌కు నిరసన సెగ తగిలింది. వార్సాలోని సోవియట్‌ సైనిక శ్మశాన వాటికలో దివంగత రెడ్‌ ఆర్మీ సైనికులకు నివాళులర్పించకుండా అండ్రీవ్‌ను అడ్డుకున్నారు. ఆయనపై ఎర్రరంగు చల్లారు.

Social Share Spread Message

Latest News