Skip to main content

Namaste NRI

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా

సెన్సేషనల్‌ స్టార్‌  విజయ్‌ దేవరకొండ హీరోగా సక్సెస్‌పుల్‌ డైరెక్టర్‌ శివ నిర్వాణ సినిమా రూపొందిస్తున్నారు.  ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్‌ దేవరకొండ సరసన సమంత నాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ క్లాప్‌ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. స్క్రీప్టును మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని, దర్శకుడు శివకు అందజేశారు. ప్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. చక్కటి కుటుంబ కథా చిత్రంలో విజయ్‌ నటిస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెలలోనే కశ్మీర్‌లో ప్రారంభం అవుతుందని మేకర్స్‌ తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్‌, వైజాగ్‌ అల్లెప్పిల్లో మిగతా షూటింగ్‌ జరుపుకుంటుందన్నారు. జయరాం, సచిన్‌ ఖేడేకర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమలో అలీ, వెన్నె కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  దీనికి హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.  ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌, జి.మురళి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events