విజయ్ కనిష్క, గరిమ చౌహాన్ జంటగా నటిస్తున్న చిత్రం కలవరం. హనుమాన్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని సీఎల్‌ఎన్ మీడియా సంస్థ నిర్మిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి సి.కల్యాణ్ క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. కొత్తదనంతో కూడుకున్న కథతో తెరకెక్కిస్తున్నాం. యువత మెచ్చే అన్ని అంశాలుంటాయి అన్నారు. వినోదం, భావోద్వేగాలు ప్రధానంగా అందరిని ఆకట్టుకునే చిత్రమిదని నిర్మాత శోభారాణి పేర్కొన్నారు. సున్నితమైన భావోద్వేగాలతో సాగే ప్రేమకథా చిత్రమిదని కథా రచయిత శశాంక్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకటేష్, సంగీతం: వికాస్ బాడిస, దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి.