Skip to main content

Namaste NRI

విక్రమ్‌… విచ్చేస్తున్నారు

కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన చిత్రం విక్రమ్‌. సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం అని శ్రేష్ఠ్‌ మూవీస్‌ సంస్థ తెలిపింది. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర తెలుగు హక్కులను హీరో నితిన్‌ సొంతం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌ దక్కించుకుంది. ఈ విషయాన్ని  చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా జూన్‌ 3న తమిళ, తెలుగు భాషల్లో విడదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌, కూర్పు: ఫిలోమిన్‌ రాజ్‌, ఛాయాగ్రహణం: గిరీష్‌ గంగాధరన్‌.

Social Share Spread Message

Latest News