Skip to main content

Namaste NRI

జాబ్‌ ఆఫర్‌ లేకుండానే గ్రాడ్యుయేట్లకు వీసా

టాప్‌ యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేట్లను దేశంలోకి ఆకర్షించేందుకు బ్రిటన్‌ న్యూ వీసా ప్రోగ్రాంను  ప్రవేశపెట్టింది. హై పొటెన్షియల్‌ ఇండివిడ్యువల్‌ (హెచ్‌ఐపీ) వీసా పేరిట ముందుకొచ్చిన న్యూ వీసా కోసం మే 30 నుంచి గ్రాడ్యుయేట్లు దరఖాస్తు  చేసుకోవచ్చు. న్యూ వీసా పాలసీ కింద అత్యధిక నైపుణ్యాలున్న విదేశీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు తమ డిగ్రీ లెవెల్‌కు అనుగుణంగా రెండు మూడేండ్ల పాటు బ్రిటన్‌లో ఉండేందుకు, పని చేసేందుకు వెసులుబాటు కలుగుతుంది. దీంతో హెచ్‌పీఐ వీసాదారుల స్పాన్సర్‌షిప్‌ ఫీజు చెల్లించకుండానే వారిని హైర్‌ చేసేందుకు బ్రిటన్‌ కంపెనీలను హెచ్‌పీఐ వీసా పాలసీ అనుమతిస్తుంది. బ్రిటన్‌ చేరుకున్న తర్వాత వీసాదారులు అక్కడ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో జాబ్‌ ఆఫర్‌ లేకుండానే ఆయా గ్రాడ్యుయేట్లకు బ్రిటన్‌ చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. గత ఐదేండ్లుగా బ్రిటన్‌ వెలుపల అర్హత కలిగిన యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి 18 ఏండ్లు పైబడిన ఏ దేశీయులైనా హెచ్‌పీఐ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events