Skip to main content

Namaste NRI

విశ్వక్‌సేన్‌ గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి గ్లింప్స్‌ విడుదల

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విశ్వక్ సేన్ కు జోడీగా నేహా శెట్టి నటిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య రచనతోపాటు దర్శకత్వం వహిస్తున్నారు.

 ఈ సినిమా టైటిల్‌ ప్రకటనతో పాటు మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు. మేము గోదారోళ్లం. మాట ఒకటే సాగదీస్తాం. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం అంటూ టైటిల్‌ గ్లింప్స్‌లో విశ్వక్‌సేన్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంది. దర్శకుడు మాట్లాడుతూ రాజమండ్రి నేపథ్యంలో నడిచే కథ ఇది. క్రూరమైన ప్రపంచంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదిగిన వ్యక్తిగా విశ్వక్‌సేన్‌ కనిపిస్తారు. ఆయన పూర్తి మాస్‌ అవతారంలో కనిపిస్తారు అని చెప్పారు. నేహా శెట్టి, అంజలి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా 2023, డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌ మధాది, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, రచన-దర్శకత్వం: కృష్ణచైతన్య.

Social Share Spread Message

Latest News