Namaste NRI

వ్లాదిమిర్‌ పుతిన్‌పై విచారణ జరుపాలి : జో బైడెన్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాడన్న అభియోగంపై విచారణ జరుపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విజ్ఞప్తి చేశారు. వైట్‌హౌస్‌ బైడెన్‌ మీడియాతో మాట్లాడుతూ వ్లాదిమిర్‌ పుతిన్‌ యుద్ధ నేరగాడని ఆరోపించారు.   ఉక్రెయిన్‌లోని బుచ పట్టణంలో హత్యాకాండపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. బుచలో ఏం జరిగిందో మీరంతా చూస్తున్నారని తెలిపారు. మేం సమాచారం సేకరించాల్సి ఉంది. పూర్తి వివరాలు రావాల్సి ఉంది. రష్యాపై యుద్ధం చేయడానికి అవసరమైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు మేం అందజేస్తూనే ఉంటామన్నారు. బుచ పట్టణంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అని చెప్పారు.

                ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపంలోని బుచ పట్టణంలో సామూహికంగా సమాధి చేసిన మృతదేహాలు బయట పడ్డాయి. ఈ నేపథ్యంలో రష్యాపై అదనపు ఆంక్షలు విధించేందుకు అమెరికా, యూరప్‌ సిద్ధమయ్యాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events