Namaste NRI

14 డేస్ లవ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

మనోజ్‌ పుట్టుర్‌, చాందిని భగవానిని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 14 డేస్‌ లవ్‌. నాగరాజ్‌ బోడెమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అఖిల్‌ అండ్‌ నిఖిల్‌ సమర్పణలో సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై హరిబాబు నిర్మిస్తున్నారు. తాజాగా   ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌ని డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ మోషన్‌ పోస్టర్‌, ఫస్‌ లుక్‌ చాలా బాగుంది. మంచి ప్రేమకథని ప్రేక్షకులకు చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు నాగరాజ్‌ బోడెమ్‌కు, నిర్మాత హరిబాబుకి ఈ చిత్రం మంచి సక్సెస్‌ని ఇవ్వాలని కోరుతూ టీమ్‌ అందరికీ ఆల్‌ ద బెస్ట్‌ అని అన్నారు. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రమిది అన్నారు నాగరాజ్‌ బోడెమ్‌. మార్చిలో మా సినిమా  విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు హరిబాబు.డి. నన్ను నమ్మి ఇంత మంచి అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌ అన్నారు హీరో మనోజ్‌.  సంగీతం : కిరణ్‌ వెన్న, ఛాయాగ్రహణం : కన్నన్‌ మునుస్వామి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events