
ఇరాన్ అణు శక్తిని 10 నిమిషాల్లో అంతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఫ్లోరిడాలోని తన ఇంట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మేం వాళ్ల అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేశాం. ఇంకా ఒకటి లేదా రెండు స్థావరాల విషయంలో చర్య తీసుకోవాల్సి ఉంది. ఆ పని పూర్తి చేయడానికి మాకు పది నిమిషాలు చాలు అని అన్నారు. ఈ వారంలో ఇరాన్‌పై తాము దాడి చేసే అవకాశం ఉందన్నారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, అయితే వాళ్లు అంత నమ్మదగినవారు కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తమకు ప్రమాదం ఏర్పడితే వెంటనే అమెరికా, ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరికపై ఆయన ఇలా స్పందించారు.















