ఇటీవలె విడుదలైన తండేల్ సినిమాను పైరసీ చేసి ఆన్లైన్లో పెట్టడంతో చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్, నిర్మాత బన్నీవాసు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ పైరసీ పెద్ద క్రైమ్. పైరసీ చేస్తున్న వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఇదే నా హెచ్చరిక. మీపై కేసులు పెట్టాం. జైలుకు వెళ్లే అవకాశముంది. యువత ఇందులో ఇరుక్కోవద్దు. నిర్మాతలు, ఫిల్మ్‌ఛాంబర్, ఓటీటీ చర్యల వల్ల కొన్నాళ్లుగా పైరసీ ఆగింది. కానీ రెండు నెలలుగా మళ్లీ మొదలైంది. తండేల్ సినిమాను పైరసీ చేయడమే కాకుండా ఓ ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారు అని అన్నారు.
ఈ మధ్య జరిగిన తండేల్ ఈవెంట్లో నేను రామ్‌చరణ్‌ను తగ్గించి మాట్లాడానని అంటున్నారు. ఈ విషయంలో నన్ను అపార్థం చేసుకున్నారు. నేను దిల్‌రాజు పరిస్థితిని వివరించే క్రమంలో అలా అన్నాను. దానికి మెగాభిమానులు ఫీలయ్యారు. ఆయన నా ఏకైక మేనల్లుడు. చరణ్‌కి నేను ఏకైక మేనమామని. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు. ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించండి అని అల్లు అరవింద్ అన్నారు. బన్నీవాసు మాట్లాడుతూ సినిమా విజయం సాధించి మేము ఎంజాయ్ చేయాల్సిన సమయంలో ఇలా జరిగింది అని చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/uk-300x160.jpg)