అమెరికాలోని ట్విన్ టవర్ మీద (9/11) దాడులు జరిగి ఈ నెల 11వ తేదీతో ఇరవై ఏండ్లు నిండుతాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు నివేదికలను బహిరంగపరుస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడం విశేషం. దాడులకు గల కారణం ఏమిటన్నది తాము తెలుసుకోవాలని బాధిత కటుంబాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. దాడుల్లో పాల్గొన్న హైజాకర్లకు సౌదీ సహాయం చేసిందన్నది వారి ప్రధాన ఆరోపణ. అయితే దాడులు(9/11) అధికారిక రహస్యాలను (డాక్యుమెంట్లను) ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు బైడెన్ ప్రకటించారు.