Skip to main content

Namaste NRI

మూడు యుగాల కథాంశంతో… అజయంతే రందం మోషణం

స్టార్ హీరో టొవినో థామస్ తన కెరీర్‌లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న పాన్ ఇండియా చిత్రం అజయంతే రందం మోషణం. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మీ కథానాయికలుగా నటిస్తున్నారు. దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. మూడు యుగాల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టోవినో మూడు పాత్రల్లో కనిపించనున్నారు. టైటిల్ క్యారెక్టర్స్ మణియన్, అజయన్, కుంజికే పాత్రలు పోషించనున్నారు. సుజిత్ నంబియార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అజయంతే రందం మోషణం పాన్ ఇండియన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రం 3డిలో విడుదల కానుంది. సౌత్ ఇండియన్ సెన్సేషన్ కృతి శెట్టికి ఇది మొదటి మలయాళ చిత్రం. యూజీఎం ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మేజిక్ ప్రేమ్స్ కూడా నిర్మాణంలో పాలుపంచుకోనుంది. ఈ సినిమా కథలో కేరళ లోని కలరి అనే మార్షల్ ఆర్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

Social Share Spread Message

Latest News