Skip to main content

Namaste NRI

మూడో ప్రపంచ యుద్ధం ఖాయం

మూడో ప్రపంచ యుద్దానికి సంబంధించి అసలైన ముప్పు ఇప్పుడు ప్రారంభం కాబోతోందని రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌కు అమెరికా, మిత్రదేశాలు మద్దతు పలుకుతుండటం, ఆయుధాలు అందించడంపై రష్యా షూటుగా స్పందించింది. ప్రస్తుత పరిస్థితులు, ఉద్రికత్తల దృష్ట్యా మూడో ప్రపంచ యుద్ధం ముప్పు వాస్తవమేనంటూ హెచ్చరించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గేయ్‌ లావ్రోవ్‌ మాట్లాడుతూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కృత్రిమంగా సృష్టిస్తున్న అణు సంఘర్షణ ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందన్నారు. అది వాస్తవం. తక్కువగా అంచనా వేయెద్దు అని పేర్కొన్నారు. యుద్దంలో పాలుపంచుకోవాలని ఉక్రెయిన్‌ నేతలు నాటో దేశాలను కోరుతూ రష్యాను రెచ్చగొడుతున్నారని నాటో కూడా అగ్నికి ఆజ్యం పోస్తున్నాయని అన్నారు. ఇది ముమ్మాటికీ నిజం. మా హెచ్చరికలను తక్కువగా అంచనా వేయొద్దు అని అన్నారు.

Social Share Spread Message

Latest News