ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి గా గుర్తింపు పొందిన వెనెజులాకు చెందిన జువాన్ విసెంటె పెరెజ్ మోరా తాజాగా మరణించారు. 114 సంవత్సరాల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. వెనెజులా కు చెందిన జువాన్ మే 27, 1909లో ఆండియన్ రాష్ట్రంలోని టాచిరా లో గల ఎల్‌కోబ్రే పట్టణంలో జన్మించాడు. జువాన్ తల్లిదండ్రులకు మొత్తం 10 మంది జన్మించగా, ఈయన తొమ్మిదో సంతానం. కాగా, 2022లో ఈ భూమ్మీద ప్రపంచంలోనే అత్యంత ఎక్కువకాలం జీవించిన వ్యక్తిగా జువాన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు ఎక్కారు.
ఫిబ్రవరి 4, 2022 నాటికి ఆయన వయసు 112 సంవత్సరాల 253 రోజులు. ప్రపంచంలోనే చాలాఏళ్లు జీవించి ఉన్న అతిపెద్ద వ్యక్తిగా ఆయన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ గుర్తించింది. ఈ మేరకు సర్టిపికేట్ కూడా అందించింది. అయితే, 114 సంవత్సరాల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. జువాన్‌కు 11 మంది పిల్లలు ఉన్నారు. 2022 నాటికి అతడికి 41 మంది మనుమలు, 30 మంది మునిమనవళ్లు ఉన్నారు.