Skip to main content

Namaste NRI

టాలీవుడ్‌కు యువత రావాలి : మంత్రి తలసాని

  యష్‌ పూరి, స్టెఫీ పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం చెప్పాలని ఉంది. ఈ చిత్రాన్ని సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆర్‌బీ చౌదరి సమర్పణలో వాకాడ అంజన్‌ కుమార్‌, యోగేష్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. అరుణ్‌ భారతి ఎల్‌ దర్శకుడు. ఈ నెల 9న విడుదలవుతున్నది. తాజాగా జరిగిన చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో అతిథిగా పాల్గొని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌  మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలోకి యువత  మరింతగా రావాలి. వారు అద్భుతాలు సృష్టించగలరు. టాలీవుడ్‌ కావల్సిన అని సహాయ సహకారాలను మా ప్రభుత్వం అందిస్తున్నది. ఈ చిత్ర ట్రైలర్‌ బాగుంది. యష్‌ పూరికి విజయం దక్కాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు అరుణ్‌ భారతి మాట్లాడుతూ   వివిధ  భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచే శారు.  అలా ఈ సినిమా రియల్‌ పాన్‌ ఇండియా మూవీగా ఆకట్టుకుంటుంది అని అన్నారు.  హీరో యష్‌ పూరి మాట్లాడుతూ ఈ నెల 9న కొన్ని పెద్ద చిత్రాలు విడుదలవుతున్నాయి. మంచి సినిమా ఎప్పుడు మీ ముందుకొచ్చినా  ఆదరిస్తారనే నమ్మకం ఉంది.  సినిమా బాగుందనే మాటే అతి పెద్ద ప్రచారం. ఆ మాట మీ దగ్గర  నుంచి  వస్తుందని ఆశిస్తున్నాం అన్నారు.  నాయిక స్టెఫీ పటేల్‌ మాట్లాడుతూ ఈ సినిమాలో వెన్నెల పాత్రలో నటించాను. చాలా మంచి  క్యారెక్టర్‌ ఇది. ఈ ఎంటర్‌టైనింగ్‌ మూవీలో యాక్షన్‌, రొమాన్స్‌ వంటి అన్ని అంశాలుంటాయి అని అన్నారు.  హీరో నిఖిల్‌ మాట్లాడుతూ  మాలాంటి యువ హీరోలు ఎదిగేందుకు ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తున్నది. చిత్రీకరణ, థియేటర్స్‌ విషయంలో ప్రభుత్వం అండగా నిలబడుతున్నది. నేనూ యష్‌ లాగే ప్రయాణం మొదలు పెట్టాను. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events