Skip to main content

Namaste NRI

ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామి రెడ్డి చేతుల మీదుగా కొత్త మలుపు ట్రైలర్ లాంచ్

గాయని సునీత తనయుడు ఆకాష్‌ గోపరాజు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం కొత్త మలుపు. భైరవి అర్థ్యా కథానాయిక. శివవరప్రసాద్‌ కేశనకుర్తి దర్శకుడు. తధాస్తు క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్‌ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్‌ దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
రొమాంటిక్‌ లవ్‌, సస్పెన్స్‌ జానర్‌లో ఈ సినిమా రూపొందించామని దర్శకుడు శివవరప్రసాద్‌ తెలిపారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని నిర్మాత తాటి బాలకృష్ణ చెప్పారు. ఇంకా హీరోహీరోయిన్లతో పాటు చిత్రబృందమంతా మాట్లాడారు.ఈ నెల 12న సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: జవహర్‌రెడ్డి, సుమంత్‌ కాచర్ల, సంగీతం: యశ్వంత్‌ నాగ్‌.


Social Share Spread Message

Latest News