Skip to main content

Namaste NRI

ఆ కుటుంబాలకు 15,000 డాలర్లు: కువైట్

దక్షిణ కువైట్ లోని మంగాఫ్‌లో జూన్ 12న ఒక భవనంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి 46 మంది భారతీయులతోసహా మొత్తం 50 మంది మృతి చెందిన విషాద సంఘటన తెలిసిందే. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 15,000 డాలర్ల ( రూ. 12.5 లక్షలు) వంతున కువైట్ ప్రభుత్వం పరిహారం ఇవ్వనున్నట్టు జూన్ 18న మీడియా నివేదిక వెల్లడించింది. ఈ పరిహారం బాధితులకు సంబంధించిన దౌత్య కార్యాలయాలకు అందజేయ బడుతుంది. మరో ముగ్గురు మృతులు ఫిలిప్పీన్లు. వీరిలో ఒకరి గుర్తింపు ఇంకా కాలేదు. బాధిత కుటుంబాలకు పరిహారం సక్రమంగా, సమర్ధంగా అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది.

 భారత ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, కేరళ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల వంతున ఆర్థికసాయం ప్రకటించాయి. మృతులు 46 మంది భారతీయుల్లో 24 మంది మళయాళీలు ఉన్నారు. కువైట్ ప్రభుత్వం ఈ అగ్నిప్రమాదానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు ప్రారంభించింది.

Social Share Spread Message

Latest News