Namaste NRI

ఒక్కరోజులో 2,425 మంది… ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు చోటు

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో యూసుఫ్‌ గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో నిర్వహించిన మెగా రక్తదాన శిభిరం రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఒక్కరోజులో అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసి జాతీయ రికార్డును సృష్టించారు. ఈ శిబిరంలో మొత్తం 2,425 మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు, సినీ కార్మికులు రక్తదానం చేయడం ద్వారా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం లభించింది. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సౌత్‌ ఇండియా ప్రతినిధి వసుధ అశోక్‌ చేతుల మీదుగా కార్యక్రమ నిర్వహకులు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ రికార్డు ధ్రువీకరణ సర్టిఫికేట్‌ను అందుకున్నారు. గత ఏడాది మంత్రి కేటీఆర్‌ జన్మదినం రోజున ఇక్కడే 2,200 మంది రక్తదానం నిర్వహించి నెలకొల్పిన రికార్డుని చెరిపేయడం విశేషం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]