ఉక్రెయిన్ దేశ ప్రజలు ధైర్యంతో ఉన్నారని అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి 50వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. 50 రోజుల యుద్ధాన్ని నిలదొక్కుకున్నామని, రష్యా దాడికి 50 రోజులు నిండిరదన్నారు. ఈ 50 రోజుల్లో ప్రపంచ దేశాధినేతలు భిన్నరకాలుగా స్పందించారన్నారు. అనేక పశ్చిమ దేశాల నేతలతో సంప్రదింపులు జరిపినట్లు ఆయన తెలిపారు. కొందరు రాజకీయవేత్తలు తమ చేతుల్లో అధికారం లేనట్లు వ్యవహరించారని అన్నారు. మేటి రాజకీయవేత్తల కన్నా రాజకీయాల్లో లేని వారు ఈ 50 రోజుల్లో ఎంతో చేశారని గుర్తు చేశారు. ఉక్రెయన్ దళాలను ప్రశంసిస్తూ రష్యా యుద్ధ నౌకలు పాతాళానికి పోవాల్సిందే అన్నారు. 50 రోజులు మనం పోరాడం అంటే అది మన ఘనతే అన్నారు. ఇది లక్షల సంఖ్యలో ఉన్న ఉక్రెయిన్ల విజయం అన్నారు.














