Skip to main content

Namaste NRI

7 గంటలకు.. రూ.52 వేల కోట్ల నష్టం

ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, ఇన్‌ స్టా సేవలు దాదాపు 7 గంటలపాటు నిలిచిపోవడంతో ఫేస్‌ బుక్‌ స్పందించింది. ఈ అంతరాయానికి చింతిస్తున్నామంటూ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తెలిపారు. మీకు ఇష్టమైన వారితో సన్నిహితంగా ఉండేందుకు ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టా, వాట్సాప్‌ ఎంతగా ఉపయోగపడుతున్నాయో తమకు తెలుసని, ప్రస్తుతం అంతా ఒకే అని చెప్పాడు. యూజర్లు అందరూ తమను క్షమించాలని జుకర్‌ బర్గ్‌ కోరాడు. సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల దాకా ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, ఇన్‌ స్టా సేవల్లో అంతరాయం ఏర్పడిరది. సాంకేతిక కారణాలతో ఈ మూడు సేవలు నిలిచిపోయాయి. 

                దీంతో వినియోగదారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరోవైపు 7 గంటల అంతరాయానిక జుకర్‌ బర్గ్‌ భారీగానే మూల్యం చెల్లించుకున్నాడు. సుమారు 7 బిలియన్ల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.52 వేల కోట్లకు పైగా నష్టం వచ్చినట్టుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Social Share Spread Message

Latest News