Skip to main content

Namaste NRI

చైనాకు షాక్… తైవాన్ కు మద్దతు తెలిపిన అమెరికా

తైవాన్‌ను దురాక్రమణ చేయాలని చైనా రంకెలు వేస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రజాప్రతినిధులు ఆకస్మికంగా తైవాన్‌ దేశానికి వెళ్లారు. ఆ దేశ అధ్యక్షురాలు సాయ్‌ ఇంగ్‌ వెన్‌ను అమెరికా ప్రజాప్రతినిధులు కలుసుకున్నారు. తైవాన్‌ స్వయం పాలనకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా తైవాన్‌, చైనా మధ్య ఘర్షణలు తారాస్థాయికి వెళ్లాయి. తైవాన్‌ స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతు ఇస్తే చూస్తూ ఉరుకోబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అమెరికా అధినేత బైడెన్‌కు ఇటీవల హెచ్చరించడం తెలిసిందే. ఉత్తరకొరియా కూడా అమెరికాపై తీవ్రస్థాయిలో మండిపడిరది. తైవాన్‌కు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, సైనిక శిక్షణను అందించడంపై ఆగ్రహ్యం వ్యక్తం చేసింది.

Social Share Spread Message

Latest News