Skip to main content

Namaste NRI

శ్రీరామ్ హీరోగా ఔట్ స్టాండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ .. ది మేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్

శ్రీరామ్‌ హీరోగా నటిస్తున్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ది మేజ్‌. ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్‌, కమల్‌ కామరాజు కీలక పాత్రధారులు. డాక్టర్‌ రవికిరణ్‌ గడలాయ్‌ దర్శకుడు. డా.ఉదయ్‌ కె.రెడ్డి పాల్వాయి, డాక్టర్‌ కేఎస్‌ఆర్‌(కరెడ్డి శ్రీధర్‌రెడ్డి), డాక్టర్‌ భరత్‌రెడ్డి గోపు, డాక్టర్‌ అనిరుధ్‌రెడ్డి సోమ నిర్మాతలు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉన్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇంటెన్స్‌ లుక్‌లో కనిపిస్తున్న లీడ్‌ యాక్టర్స్‌ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. న్యూ ఏజ్‌ కమర్షియల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతున్నదని మేకర్స్‌ తెలిపారు.

వాస్తవం, భ్రమ మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ, ప్రతిక్షణం మీ ఆలోచనలను సవాలు చేసే జెయింట్‌ వీల్‌ ప్రయాణం లాంటి ఉత్కంఠభరితమైన సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని, చివరి క్షణం వరకూ ఏ జరుగుతుందో ఊహించలేని విధంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి మలుపు ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్‌ భరద్వాజ్‌, నిర్మాణం: యూఆర్‌ క్రియేషన్స్‌, శ్రౌష కమల ఆర్ట్స్‌.

Social Share Spread Message

Latest News