Skip to main content

Namaste NRI

హెచ్‌1-బీ వీసాల‌ను మూడేళ్లు నిలిపివేయండి.. అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు

హెచ్‌-1బీ వీసాల జారీని మూడు సంవత్సరాల పాటు నిలిపివేయాలని కోరుతూ రిపబ్లికన్‌ సెనెటర్‌ టిమ్‌ షీహీ చట్టసభలో బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతి హెచ్‌-1బీ వీసా పిటిషన్‌పై విధించే లక్ష డాలర్ల రుసుమును తిరిగి ప్రవేశపెట్టాలని కూడా అందులో కోరారు. గతంలో ట్రంప్‌ ప్రభుత్వం విధించిన ఈ రుసుమును ఫెడరల్‌ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల నియామకం కోసం అమెరికా కంపెనీలు ఈ వీసా కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారు. తాజా ప్రతిపాదన ఈ కార్యక్రమంలో భారీ మార్పులను కోరుతోంది. అమెరికా కార్మికుల హక్కులను సులభంగా ఉల్లంఘిస్తున్న ఈ వీసాలను జారీ చేయకూడదని సెనెటర్‌ టిమ్‌ షీహీ చెప్పారు.

హెచ్‌-1బీ వీసా కార్యక్రమం ప్రత్యేకమైన, భర్తీ చేయడం కష్టమైన ఉద్యోగాలలో కార్మికుల కొరతను తీర్చడానికి ఉద్దేశించిందని, అంతేకానీ అర్హత కలిగిన, కష్టపడి పనిచేసే అమెరికన్ల స్థానంలో చౌకగా విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఉపయోగపడేది కాదని టిమ్‌ అన్నారు. తాను ప్రతిపాదించిన బిల్లు ఉద్యోగుల రక్షణ చర్యలను బలోపేతం చేస్తుందని, జాతీయ భద్రతా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశీయ కార్మికులకు మేలు చేస్తుందని తెలిపారు. అమెరికా ఉద్యోగులకు ఎదురయ్యే ముప్పును నివారించడంలో తాను ప్రతిపాదించిన బిల్లు కీలకమైన, ముందు చూపుతో కూడిన చర్య అని టిమ్‌ షీహీ చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events