Skip to main content

Namaste NRI

లేడీ ఓరియెంటెడ్ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్

ప్రస్తుతం బాలీవుడ్‌ పాన్‌ ఇండియా మూవీ రామాయణ లో సీతాగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మణిరత్నం సినిమాకు కూడా ఈ అందాలభామ ఓకే చెప్పింది. కాకపోతే తండేల్‌ తర్వాత తెలుగులో ఏ కథనూ సాయిపల్లవి ఓకే చెయ్యలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు తిరుమల కిశోర్‌ ఇటీవలే సాయిపల్లవికి ఓ కథ వినిపించారట. మహిళా ప్రధానంగా సాగే ఈ కథలో, దైవిక శక్తులు, పురాణాల టచ్‌ కూడా ఉందట. కథలోని భావోద్వేగాలు, పాత్ర ప్రాధాన్యత సాయిపల్లవిని ఆకట్టుకున్నాయని, ఈ ప్రాజెక్ట్‌పై ఆమె సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తున్నది. ఇక దీనిపై సాయిపల్లవి నుంచి అధికారికంగా గ్రీన్‌సిగ్నల్‌ వస్తే, ఇతర నటీనటులు, నిర్మాతల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events