Skip to main content

Namaste NRI

అనకాపల్లి నుంచి ఎలగే పిల్ల రొమాంటిక్‌ సాంగ్ వచ్చేసింది

విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్న చిత్రం అనకాపల్లి. ఖగేష్‌ తమ్మినేని దర్శకత్వం. ఈ చిత్రాన్ని కాండ్రేగుల నాయుడు, త్రినాథ రావు నక్కిన నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ఎలగే పిల్ల అనే పాటను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు. దేవ్‌జండ్‌ సంగీతాన్నందించిన ఈ పాటను అనంత్‌శ్రీరామ్‌ రచించారు. అనకాపల్లి నేపథ్యంలో నడిచే ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంటుందని, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయని దర్శకుడు తెలిపారు. ఆగస్ట్‌ 7న విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవ్‌జండ్‌, కథ, స్క్రీన్‌ప్లే: త్రినాథరావు నక్కిన, దర్శకత్వం: ఖగేష్‌ తమ్మినేని.

Social Share Spread Message

Latest News