Skip to main content

Namaste NRI

తానా (TANA) మిడ్-అట్లాంటిక్ అడాప్ట్-ఎ-హైవే విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం చేసే సేవా కార్యక్రమాలు తెలుగు కమ్యూనిటీతో పరిమితం కాకుండా తాము నివసిస్తున్న అమెరికా ప్రజలకు కూడా ఉపయోగపడేలా సేవలను అందిస్తూ వస్తోంది. అందులో భాగంగా సెప్టెంబర్ 13వ తేదీన పెన్సిల్వేనియాలోని మెకానిక్స్ బర్గ్ లోని ఉడ్స్ డ్రైవ్ వద్ద అడాప్ట్ హైవే కార్యక్రమాన్ని నిర్వహించింది. వరుసగా మూడవ ఏడాది కూడా ఇలాంటి కార్యక్రమాన్ని తానా మిడ్ అట్లాంటిక్ విభాగం నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మందికిపైగా వలంటీర్లు పాల్గొని రోడ్ల శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలవడంతోపాటు సహకారాన్ని అందించిన సతీష్ చుండ్రు, రాజు గుండాల, శ్రీనివాస్ కోట, వెంకట్ ముప్ప, శ్రీనివాస్ అబ్బూరి, సాంబ నిమ్మగడ్డ, కృష్ణ పుట్లూరి, శ్రీనివాస్ కాకర్ల, రాజేష్ కందుల మరియు రామారావు చెరుకుమల్లికి తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలను తెలియజేసింది. మాతో కలిసి తమ శక్తిని, సమష్టి కృషిని మరియు సమాజ సేవ పట్ల ఉన్న అంకితభావాన్ని చాటుకున్న మెకానిక్స్ బర్గ్ ఎఫ్ టి సి టీమ్‌లు ‘ది జావేంజర్స్’ (FTC Team #8486) మరియు వారి సిస్టర్ టీమ్ ‘ఆర్కిటెక్స్’ (FTC Team #25795))కి కూడా ప్రత్యేక ధన్యవాదాలను తానా నాయకులు తెలియజేశారు.


తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి. ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ లావు, బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, తానా మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు గార్లు ఈ గొప్ప కార్యక్రమం కోసం 100 మందికి పైగా వాలంటీర్లను ఒకచోట చేర్చి, సమాజ సేవ పట్ల అత్యుత్తమ అంకితభావాన్ని కనబరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ తానా నాయకత్వం ధన్యవాదాలు చెప్పింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events