Skip to main content

Namaste NRI

షరతులకు ఒప్పుకుంటేనే ఇరాన్ తో … ట్రంప్

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నేతలతో జరగబోయే కీలక భేటీకి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా భద్రతా ప్రమాణాలు, అంచనాలకు కట్టుబడి ఉంటేనే ఇరాన్‌తో మంచి ఒప్పందం కుదుర్చుకుంటామని, లేకపోతే ఎలాంటి చర్చలకూ తావులేదని తేల్చి చెప్పారు. ఇరాన్ వైపు నుంచి తమకు ఒప్పందం కోసం సంకేతాలు వచ్చాయని, అయితే వారు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధపడలేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

వచ్చే వారం న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాల అధినేతలతో ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా సైనిక స్థావరాలపై దాడులు, చమురు ఎగుమతులకు అంతరాయం కలగడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌ను మరింత విస్తరించేందుకు అమెరికా ప్రణాళికలు వేస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events