Skip to main content

Namaste NRI

భారత్ కీలక నిర్ణయం… ఈ 12 దేశాల నుంచి వచ్చేవారికి

కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆఫ్రికన్‌ దేశాల రాకపోకలపై పలు దేశాలు ఇప్పటికే నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఒమైక్రాన్‌ కేసులు నమోదవుతున్న దేశాలతో పాటు వాటితో లింకులున్న 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్‌, కరోనా టెస్టు తప్పనిసరి చేసింది.

                 ఈ జాబితాలో దక్షిణాఫ్రికా, చైనా, యూకే, న్యూజిలాండ్‌, సింగపూర్‌, ఇజ్రాయిల్‌, బంగ్లాదేశ్‌, హాంగ్‌కాంగ్‌, బోత్స్వానా, మారిషన్‌, రెండు యూరోప్‌ దేశాలు ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్‌ బి.1.1..529 మొదట దక్షిణాఫ్రికాలో బయటపడినప్పటికీ తాజాగా బోత్స్వానా, హాంగ్‌కాంగ్‌లో కూడా కొత్త కేసులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచన చేసింది.

Social Share Spread Message

Latest News