Skip to main content

Namaste NRI

ఈ సినిమాతో నా కల నెరవేరింది : రుత్విక్‌

రుత్విక్‌, విశాఖ ధిమాన్‌ జంటగా నటించిన పీరియాడిక్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ రాజా ది రాజా చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. అనిల్‌ బోయిడపు దర్శకత్వంలో బృందావన్‌ క్రియేషన్స్‌ పతాకంపై కె.నిహారిక దాసరి నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ విడుదల చేస్తున్నది. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. హీరో కావాలనే తన కల ఈ సినిమాతో నెరవేరిందని, టీమ్‌ అంతా పాషన్‌తో సినిమా చేశామని, ప్రీమియర్స్‌కు వచ్చిన స్పందన విజయంపై నమ్మకాన్ని పెంచిందని హీరో రుత్విక్‌ అన్నారు.

వినూత్నమైన కథతో సినిమా తీశామని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని నిర్మాత కె.నిహారిక దాసరి తెలిపింది. కథలోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కదిలిస్తాయని దర్శకుడు అనిల్‌ బోయిడపు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు మార్క్‌ కె రాబిన్‌తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News