Skip to main content

Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు ఖండించిన చైనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను చైనా ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో తనను ఓడించడానికి చైనా భారీ డేటా హ్యాకింగ్‌కు పాల్పడిందంటూ ట్రంప్ చేసిన వాదనలు ఆధారం లేనివి, దురుద్దేశపూర్వకమైనవి అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. తాము అమెరికా ఎన్నికల్లో ఎప్పుడు తలదూర్చలేదని, భవిష్యత్‌లోను జోక్యం చోసుకోమని చైనా దౌత్య కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తప్పుడు ఆరోపణలతో అమెరికా చైనాను అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. వారి దేశంలో జరిగే ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఆసక్తి ఏమాత్రం లేదని చైనా స్పష్టం చేసింది.

కాగా, అమెరికా దేశాధ్యక్ష ఎన్నిక‌ల్లో డ్రాగ‌న్ దేశం చైనా జోక్యం చేసుకున్నట్లు డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయ‌న ప్రసంగించారు 2020 దేశాధ్యక్ష ఎన్నిక‌ల్లో చైనా జోక్యం చేసుకున్నదని, అమెరికా ఓటింగ్ విధానం తీవ్ర ప్రభావానికి గురైంద‌ని, అయితే ఓట‌ర్లను మార్చిన అంశంపై మాత్రం ఆయ‌న క్లారిటీ ఇవ్వలేదు. కానీ దానికి సంబంధించిన ఆధారాల‌ను మాత్రం ఆయ‌న స్పష్టంగా వెల్లడించలేదు. 2020 దేశాధ్యక్ష ఎన్నిక‌ల్లో జ‌రిగిన హోరాహోరీ పోరులో జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓట‌మి పాల‌య్యారు. ఎల‌క్ట్రానిక్ ఓటింగ్, బ్యాలెట్ కౌంటింగ్ వ్య‌వ‌స్థ‌ల్లో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు వైట్‌హౌజ్ సుమారు నాలుగు సెక్ష‌న్ల డాక్యుమెంట్ల‌ను రిలీజ్ చేసింది. అమెరికా ఓట‌రు డేటాను చైనా దుర్వినియోగం చేసిన‌ట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు అని చైనా ట్రంప్‌ వ్యాఖ్యలను కొట్టిపారేసింది.

Social Share Spread Message

Latest News