Skip to main content

Namaste NRI

హుషార్‌ పిట్టలు నుంచి టోంగా.. టోంగా సాంగ్ రిలీజ్‌

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతున్న చిత్రం హుషార్‌ పిట్టలు. బిక్షు దర్శకుడు. రుద్రక్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఆగస్ట్‌ 15న ఏషియన్‌, సురేష్‌ ఫిలింస్‌ ద్వారా థియేట్రికల్‌ రిలీజ్‌ కానుంది. ఈ సినిమా నుంచి టోంగా టోంగా అనే గీతాన్ని విడుదల చేశారు. చరణ్‌ అర్జున్‌ స్వరపరిచిన ఈ గీతాన్ని మంగ్లీ ఆలపించారు.

యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, తెలుగులో ట్రెండ్‌ సృష్టిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు బిక్షు పేర్కొన్నారు. టీజర్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అయిందని, కొంతమంది ట్రోల్‌ చేశారని, అయితే సినిమా రిలీజ్‌ అయిన తర్వాత అసలు కథేమిటో అందరికీ తెలుస్తుందని, హృదయాలకు హత్తుకునే చిత్రమిదని నిర్మాత వెంకట్‌ యాదవ్‌ తెలిపారు. టీజర్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, సినిమా చూసిన తర్వాత వారి ఆలోచన మారిపోతుందని హీరో అన్షు అన్నారు.

Social Share Spread Message

Latest News