Skip to main content

Namaste NRI

విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్​ మరో బాంబ్‌.. ఇకపై నాలుగేళ్ల వరకే!

అమెరికాలో 3.3 లక్షల మందికిపైగా భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థులు త్వరలో కఠినమైన వలస నిబంధనలను ఎదుర్కొనే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా అమల్లో ఉన్న డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌ విధానాన్ని తొలగించి దాని స్థానంలో నిర్ణీత కాల నివాసాన్ని ప్రవేశపెట్టే నిబంధనను అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) ఖరారు చేసిన నేపథ్యంలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.

కొత్త నిబంధన కింద ఎఫ్‌-1 వీసాలపై ఉన్న విద్యార్థులు సాధారణంగా అమెరికాలో గరిష్ఠంగా నాలుగేండ్లపాటు ఉండేందుకు అనుమతిస్తారు. తమ చదువులను పూర్తి చేయడానికి అదనపు సమయం అవసరమైన వారు తమకు అనుమతించిన బస గడువు ముగిసేలోపు డీహెచ్‌ఎస్‌ నుండి గడువు పొడిగింపును పొందవలసి ఉంటుంది. ఈ నిబంధన జే-1 ఎక్సేంజ్‌ విజిటర్లు, విదేశీ మీడియా ప్రతినిధులకు జారీ చేసే 1-వీసాదారుల బస కాలపరిమితిని కూడా నిర్దేశిస్తుంది. ఇది అమల్లోకి రావడానికి ముందు కాంగ్రెస్‌ పరిశీలన పొందాల్సి ఉంటుంది. వీసా వ్యవస్థపై పర్యవేక్షణను బలోపేతం చేయడం, జాతీయ భద్రతాపరమైన ఆందోళనలను పరిష్కరించడమే ఈ మార్పుల లక్ష్యమని ట్రంప్‌ ప్రభుత్వం పేర్కొంది.

Social Share Spread Message

Latest News